చుండ్రుతో బాధపడుతున్నారా ? ఇలా తగ్గించుకోండి. Suffering from dandruff ? Follow these tips. Best home tips for cure dandruff in Telugu.

      

    చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు (dandruff). శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. చల్లని గాలులు, జుట్టు తడి ఆరకపోవడం దీనికి కారణాలు. చుండ్రు వల్ల దురద, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇంట్లోనే చిన్నపాటి చర్యలు పాటించడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.  

 1. కొబ్బరి నూనె, నిమ్మరసం: కొబ్బరినూనె జుట్టుకు పోషకాలను అందిస్తుంది. నిమ్మరసం చుండ్రుకు చికిత్స. ఎటువంటి రసాయనాల వాడకం లేకుండా చుండ్రును నివారించవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో అంతే నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో మాడును నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాలాగిిి షాంపూ చేసుకోవాలి. 
 2. మెంతిపిండి ప్యాక్: ఇది చుండ్రుకు సరైన పరిష్కారం. రాత్రి మెంతి గింజలను నీళ్లలో ఈనానబెట్టాలి. ఉదయాన్నేే నీటిని వ్పే మెంతులను గ్రైండ్ చేసి తలకు పట్టించి గంట ఆగి తలస్నానం చేయాలి.
 3. పెరుగు: తల అంతా పెరుగు పుట్టించడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా, చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెరుగు తలంతా పట్టించి గంట సేపటిి తర్వాత కడగాలి.
 4. బేకింగ్ సోడా: ముందుగా తలను తడుపు కోవాలి. ఒక స్పూన్ బేకింగ్ సోడాను మాడుకు పట్టించాలి. గంట లేదా గంటన్నర ఉంచి కడిగేయాలి.
 5. టిట్రీ ఆయిల్: మాడు మీద కొన్ని చుక్కలు ట్రీ ట్రీ ఆయిల్ వేసి తలంతా స్పెండ్ చేయాలి. ఐదు నిమిషాలు ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి.
 6. యాపిల్ సైడర్ వెనిగర్:  ఇది చుండ్రు, జుట్టు రాలేేే సమస్యకు మంచి పరిష్కారం. ఈ సమస్యలకు యాపిల్ సైడర్ వెనిగర్ సరైన పరిష్కారం.నీరు, యాపిల్ సైడర్ వెనిగర్ లను సమపాళ్ళలో తీసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకొని తడి తలపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. బాగా మసాజ్ చేసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. 
 7. హెన్నా: గోరింట పొడి జుట్టును మృదువుగా ఉంచుతుంది. దీనిలో కలిపే నిమ్మరసం చుండ్రుకు మంచి పరిష్కారం. గోరింటాకుు పొడిలో టిి డికాక్షన్, పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని మిశ్రమాన్ని 8 గంటలు అలాగే పక్కన ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మాడుకు తలకు పట్టించి గంటన్నర తర్వాత కడిగేయాలి.
 

 • వేపరసం: వేప యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన గృహ చికిత్స. కొద్ది వేపాకును గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత నీటిితో కడిగేయాలి.
 • ముల్తానీ మట్టి: ఇది శిరోజాల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ముల్తాని మట్టి, నీరు, నిమ్మరసం కలుపుకుని, ని ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి, ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి.  
 • ఆరెంజ్  పీల్ ప్యాక్: ఆరెంజ్ పీల్ ను ఫుడ్ ప్రాసెసర్లో వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. గ్రైండ్ చేసి మాడుకు పట్టించి అరగంటాగి మైల్డ్ షాంపూ తో కడిగేయాలి. వీటిలో దేనిని వాడినా వారంలో కనీసం మూడు సార్లైనా అనుసరిస్తేనే ఉత్తమ ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
 • వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

  0 వ్యాఖ్యలు