మీకు తెలుసా ‘షాంపు’ పుట్టింది ఇండియా లోనే

            మనం రోజూ తలస్నానం చేసే షాంపు’  ను విదేశీయులు కనిపెట్టారనుకుంటే పొరపాటే. ‘షాంపు’ ను  మొదట కనిపెట్టింది ఇండియానే. అంతేకాదు ‘షాంపు’ అనే పదంపుట్టింది కూడా ఇండియా లోనే. ఇంగ్లీష్ లోని ‘షాంపు’ అనే పదం హిందీ లోని "చాంపూ" అనే పదం నుండి వాడుకలోనికి వచ్చింది. సంస్కృతంలో దీన్ని ' ఛాంప్యాతి' అని అంటారు. అంటే నూరడం లేదా  దంచడం లేదా  పొడిచేయడం అని అర్ధం. 
              పూర్వం తలను శుభ్రం చేసుకోవడానికి ప్రత్యేకంగా మూలికలను పొడిచేసి పేస్టులా తయారు చేసుకొనేవారు. ముఖ్యంగా కుంకుడు కాయ, ఉసిరి, శీకాకాయ, మందార పూల మిశ్రమాన్ని తలకు పట్టించేవారు. దీనివల్ల జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు చుండ్రు, దురద దరిచేరేవి కావు. ఈ మిశ్రమాన్ని అప్పట్లో 'చాంపూ ' అని పిలిచేవారు. అది క్రమేణా కమర్షియల్ హంగులతో ‘షాంపు'  గా మారింది. చిక్ షాంపు కంపెనీ ఇండియా లో తోలి ‘షాంపు' సాచెట్ ను విడుదల చేసింది.

                      

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు