మెదడు చురుకుదనం పెరగాలంటే ఈ పండ్లు తినాలి. These fruits should be eaten to improve brain agility.

                         మెదడు చురుగ్గా పనిచేయాలంటే రోజూ ఖర్జూరాలను తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నరాలకు బలాన్ని చేకూర్చడంతో పాటు మెదడును చురుగ్గా ఉంచే గుణాలు ఖర్జురా పండ్లలో పుష్కలంగా ఉన్నాయి. జ్ఞాపక శక్తిని పెంపొందించడంతోపాటు చెడు కొలెస్ట్రాల్ను ఇది దూరం చేస్తుంది. అందుకే రోజు 2 ఖర్జూరాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ లోపాముతో బాదపడేవారు  ఖర్జూరాలను తప్పకుండా తీసుకోవాలి. ఖర్జూలలో ఉండే సల్ఫర్ శరీరంలో ఉండే అలర్జీలను దూరం చేస్తుంది. ఇందులోని అవినో ఆంలాలు, ఫైబర్ జీర్ణ కోశ వ్యాధుల్ని నయం చేస్తాయి. ఖర్జూరం లో కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం వంటి ధాతువులు ఉండడం వాళ్ళ ఇది రక్త హీనతకు చెక్ పెడుతుంది. ఖజూరాలు జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు