భూమ్మీదికి గ్రహాంతర వాసులొచ్చారా...!?

                     భూమిమీదికి గ్రహాంతరవాసులు వచ్చి వెల్తున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కేవలం ఇరవై మంది మాత్రమే  నివసించే ఒక దీవిపై ఒక వింత ఆకారం ల్యాండ్ అయినట్లు ఈమధ్య గూగుల్ ఎర్త్ లో రికార్డ్ అయింది. దీంతో వారి అభిప్రాయానికి బలం చేకూరింది. అయితే అది ఎంతవరకు నిజమో ఇప్పుడే చెప్పలేమని వారంటున్నారు. గతంలో గ్రహాంతర వాసులపై ఎన్నో కథనాలు వచ్చాయని, అయితే వాటిని నిరూపిస్తూ ఒక్క బలమైన ఆధారం కూడా దొరకలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఆదీవిలో కనబడిన దృశ్యాలతో ఒక చిన్న ఆశ మాత్రం కలిగిందన్నారు. గూగుల్ ఎర్త్ లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తే ఆ ప్రదేశంలో స్పేస్ షిప్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోందని వారు చెప్తున్నారు.అయితే ఈ వార్తను కొందరు కొట్టి పారేస్తున్నారు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు